Monday, December 23, 2024

పెండింగ్‌లో విద్యుత్ సిఎండిల రాజీనామాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి పభాకర్‌రావు, ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల రావులు రాజీనామాలు విద్యుత్‌శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం హయాంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, సిఎండి బాధ్యతలు నిర్వహించిన దేవులపల్లి పభాకరావు, ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాల రావులు నూతన కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాల రావు పాల్గొన్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగా సమావేశానికి సంబంధించిన సమాచారం ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుకు తెలియక పోవడంతో ఆయన విద్యుత్ సమీక్షా సమావేశంలో పాల్గొనలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News