Saturday, November 23, 2024

ప్రజా దర్బార్ ప్రారంభంతో నగరవాసుల హర్షం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దర్బార్‌ను ప్రారంభిచడంతో గ్రేటర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదటైనా తమ సమస్యలు తక్షణమే పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రతి సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే వారు. తద్వారా తమ సమస్యలను నగరవాసులు ఉన్నతాధికారులకు విన్నవించుకునే వారు. దీంతో వారి సమస్యలు కొంతలో కొంతైనా పరిష్కారం అయ్యేవి. అయితే కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారి పోయింది.. ప్రజల ఆరోగ్యం దృష్యా ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు పూర్తిగా రద్దు చేశారు. అంతేకాకుండా దాదాపుగా ఏడాదిన్నర పాటు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలను అనుమతించలేదు.. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ఫిర్యాదులను స్వీకరించారు. దీంతో అధికారులకు ప్రజలకు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోవడం, మరోవైపు ఆన్‌లైన్ దరఖాస్తులను పరిష్కరించడంలో అధికారులు పెద్దగా శ్రద్ద చూపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అష్టకష్టాలు పడ్డారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడ గడిచిన 3 ఏళ్లుగా జిహెచ్‌ఎంసిలో ప్రజావాణిని పూర్తిగా నిలిపివేయగా, జిల్లా కలెక్టరేట్‌లో మాత్రం గత నాలుగు నెలల కిత్రం ప్రారంభించారు. అది కూడ నామమాత్రమేగా మారడంతో సమస్యలు పరిష్కారం కాగా నగరవాసులు తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. అధికారుల తప్పిందాల కారణంగా గత ప్రభుత్వం నింద పడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇక ప్రతి శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో అధికారులంతా అప్రమత్తమైయ్యారు. శుక్రవారం తొలిసారి జరిగిన ప్రజా దర్బార్‌లో గ్రేటర్ హైదరాబాద్ వాసులకు సంబంధించి ఫిర్యాదులను మంత్రి సీతాక్క కలిసి జిహెచెంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలు స్వీకరించారు. దీంతో తమ సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రికే వినవించుకోవడంతో త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశా భావం వ్యక్తం చేశారు.

అప్రమత్తమైన వార్డు ఆఫీసు అధికారులు ః
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేందుకు గత ప్రభుత్వం గ్రేటర్ వ్యాప్తంగా వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా గ్రేటర్‌లోని 150 డివిజన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇందులో రోజువారిగా ప్రజల ఆయా డివిజన్లకు చెందిన ప్రజల సమస్యలను స్వీకరించేందుకు వార్డు నిర్వహణ అధికారితో పాటు 10 ముఖ్య విభాగాలకు సంబంధించిన ఉద్యోగులను నియామించారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను స్వీకరించేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్‌ను సైతం నియమించారు. దీంతో ప్రస్తుతం జిహెచ్‌ఎంసికి సంబంధించిన సమస్యలు అక్కడే పరిష్కారం అవుతున్నాయి.

ఇదేక్రమంలో ముఖ్యమంత్రి ప్రజా దర్బార్‌ను అందుబాటులోకి తీసుకురావదంతో తమకు అందిన సమస్యలను మరింత త్వరితగతిన పరిష్కరించేందుకు వార్డు ఆఫీసు నిర్వహణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ నిర్మణాలతో పాటు మరికొన్ని కీలక సమస్యలను వార్డు ఆఫీసు సిబ్బంది పరిష్కరించకపోతుండడంతో వాటిని సైతం త్వరితగతిన పరిష్కరించేందుకు గతంలో మాదిరిగా జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిని తిరిగి ప్రారంభించే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News