- Advertisement -
బీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికయ్యారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశమైంది. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేసీఆర్ ను శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు.
బిఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ను మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరిలు ప్రతిపాదననను బలపరిచారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించనున్నారు.
- Advertisement -