మనతెలంగాణ, సిటిబ్యూరోః తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న వ్యక్తిని సౌత్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 50.15 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్, ఫలక్‌నూమా, జహనూమాకు చెందిన ఎండి ఆరిఫ్ అలియాస్ ఆరిఫ్ వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
మోయిన్‌బాగ్, సంతోష్‌నగర్‌కు చెందిన ఫిర్దోజ్ బేగం ఈ నెల 5వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇంటికి తాళం వేసి ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న సోదరి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చూసేందుకు వెళ్లింది. మళ్లీ 6వ తేదీన తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. వెంటనే ఇంట్లోకి వెళ్లిన బాధితురాలు బెడ్‌రూమ్‌లో అల్మారాను తెరిచి చూసింది. దీంతో అందులో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, నగదు కన్పించలేదు.
ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించిన బాధితురాలు వెంటనే సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఎడిసిపి ఎవిఆర్ నర్సింహారావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ సైదా బాబు, ఎస్సై సాయిరాం, రాఘవేందర్‌రెడ్డి, పిసిలు నయిం, విజయ్ రాజ్ తదితరులు పట్టుకున్నారు.