Saturday, November 23, 2024

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హర్షణీయం

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లలో భాగంగా ఒకటి రాష్ట్రంలోని ఆర్‌టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం హర్షణీయం అని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ యమునా గౌడ్ లు అన్నారు. హైదరాబాద్, లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తో కలసి హేమ జిల్లోజు, నర్సింగ్ యమునా గౌడ్ లు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్బంగా అధ్యక్షురాలు హేమ జిల్లోజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాపీ కొట్టిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అఖండ విజయానికి ఆప్ మేనిఫెస్టో కారణమని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో, పంజాబ్ లో ఉచిత విద్య, వైద్యం, నీరు, విద్యుత్తు, మహిళలకు ఉచిత రవాణా, నెలవారీ భత్యం గురించి ఆప్ చేసిన వాగ్దానాలు సక్రమంగా అమలు చేస్తూ దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోందని తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీలను తెలంగాణ కాంగ్రెస్ కాపీ కొట్టినా వాటిని సక్రమంగా అమలు చేయాలనీ కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజెసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దానిని చెత్త బుట్టలో వేసినట్లు కనిపిస్తుందని, పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అభినందనీయం అని అన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఢిల్లీ, పంజాబ్ ఆప్ ప్రభుత్వాలు దేశంలోనే ముందువరసలో ఉన్నాయని, అరవింద్ కేజ్రీవాల్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను ఆరు నెలలలోపు అమలు చేయాలనీ వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆప్ అధికార ప్రతినిధి అఫ్సహా, నేతలు మౌనిక, వైశాలి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News