Friday, December 20, 2024

లారీని ఢీకొట్టిన టెంపో వాహనం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లారీని టెంపో వాహనం ఢీకొట్టిన ఘటనలో 11 మంది అయ్యప్ప భక్తులకు గాయలైన సంఘటన ఆంద్రప్రదేశ్ లోని కోవూరు పట్టణంలో చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన 11 మంది భక్తులు కాకినాడ, పలాసకు చెందినవారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా టెంపో వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ఘటనలో టెంపో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికుల సమాచారం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News