Monday, December 23, 2024

మొయిత్రాపై వేటు బాధాకరం: బిజెపి ఎంపి దూబే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టిఎంసి ఎంపి మహువా మొయిత్రా సభ్యత్వ రద్దు తనకు బాధాకరం అని, దుర్దినం అని బిజెపి ఎంపి నిశికాంత్ దూబే పేర్కొన్నారు. ఈ బిజెపి ఎంపి చేసిన ఫిర్యాదుతోనే టిఎంసి ఎంపిపై లోక్‌సభ వెబ్‌సైట్ లాగిన్ దుర్వినియోగం ఆరోపణలు వెలువడ్డాయి. తరువాత వేటు పడింది. ఈ పరిణామం తనకు సంతోషకరం ఏమీ కాదని, బాధ కల్గించిందని దూబే శనివారం తెలిపారు. .

తాను ఈ పరిణామానికి నవ్వుతున్నానని అనుకుంటూ ఉండొచ్చునని , కానీ తనకు బాధ కల్గించిందని వివరించారు. అవినీతి , జాతీయ భద్రతా అంశంలో ఓ ఎంపి బహిష్కరణకు గురి కావడం తనకే కాదు ఇతర పార్లమెంటెరియన్లందరికి ఇబ్బంది కల్గించే విషయం అయిందన్నారు. ఎంపి జాతీయ భద్రతను పరిరక్షించాల్సి ఉంటుంది. కానీ ఈ కారణంగానే ఎంపి వేటుకు గురి అయితే ఏ ఎంపి అయినా సంతోషిస్తారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News