Saturday, November 23, 2024

హైదరాబాద్ శాఖ ప్రారంభించిన జెఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జెఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ తమ పునరుద్ధరించిన హైదరాబాద్ శాఖను ఈరోజు ప్రారంభించింది. ఈ శాఖను ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ అసిత్ భండార్కర్, స్ట్రాటజిక్ అలయన్స్ డైరెక్టర్ మనీష్ శర్మ, దక్షిణ జోనల్ హెడ్ జ్యోత్స్నా కులకర్ణి, ఎపి & తెలంగాణ రీజనల్ హెడ్ విజయ్ దినకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగం పట్ల సంస్థ యొక్క నిబద్ధతను సూచిస్తుంది.

‘ముత్యాల నగరం’గా పేరొందిన హైదరాబాద్, తెలంగాణకు టెక్నో-సావీ రాజధానిగా నిలుస్తోంది. విస్తృత శ్రేణి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న ముత్యాల పరిశ్రమతో, నగరం “సైబరాబాద్” వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఉదాహరణగా ఉంది.

ఈ సందర్భంగా జెఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ అసిత్ భండార్కర్ మాట్లాడుతూ.. “అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ AUM వృద్ధి 2021 మార్చిలో దాదాపు రూ.66K కోట్ల నుండి సెప్టెంబర్, 2023కు 90K కోట్లకు పెరిగింది. మొత్తం 35% వృద్ధిని సాధించింది. ఈ నగరం దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. ఈ కంపెనీ తాజాగా కొద్ది మంది కొత్త సభ్యులను నియమించుకుంది. హైదరాబాద్‌ మార్కెట్ కు మరింత బలం జోడించటానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News