Monday, December 23, 2024

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పేలి ఎదురుగా వస్తున్న డంపర్ వాహనాన్ని ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగి 8మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని బరేలీ-నైనిటాల్ జాతీయ రహదారిపై శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. జాతీయ రహదారి మీద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు టైర్ ప్రమాదవశాత్తు పేలడంతో.. ఉత్తరాఖండ్ నుంచి ఎదురుగా వస్తున్న డంపర్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి.

కారు డోర్లు లాక్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో డంపర్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కో్సం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News