Sunday, December 22, 2024

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

కారు చెరువులోకి దూసుకెళ్లి.. నలుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కర్నాటకలో జరిగింది. శనివారం రాత్రి కర్నాటక చక్ బల్లాపూర్ లో ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. చిక్ బల్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెరువుల్లోంచి మృతదేహాలను వెలికితీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని.. బెంగళూరులోని రేవా కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News