Monday, December 23, 2024

ఆ ఒక్క ఓటమికి రోహిత్ బ్యాడ్ కెప్టెనా?: గంభీర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడంతో రోహిత్ శర్మపై విమర్శలు వచ్చాయని కానీ టీమిండియా మాజీ ఆటగాడు గంభీర్‌ మాత్రం ప్రశంసించారు. రోహిత్ కెప్టెన్‌గా గొప్పగా రాణించి టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడని కొనియాడారు. ఫైనల్ మ్యాచ్‌లో బ్యాడ్ గేమ్ తప్పించి టోర్నీ మొత్తం భారత జట్టు ఆధిపత్య చేలాయించిందని తెలిపారు. రోహిత్ గొప్ప కెప్టెన్నీ కావడంతో ఐపిఎల్‌లో ఐదు ట్రోఫీలు గెలుచుకున్నాడని మెచ్చుకున్నారు. ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలిచినప్పటికి భారత్ ఛాంపియన్‌లా ఆడిందన్నారు. ఆ ఒక్క రోజు బ్యాడ్ గేమ్ రోహిత్‌ను, టీమిండియాను చెడ్డగా చూపించదని అందుకే వారికి ఆయన మద్దతు పలికారు.

వరల్డ్ కప్‌లో పది మ్యాచ్‌లు గొప్పగా ఆడారని ప్రశంసల జల్లు కురుపించారు.2024లో జరిగే టి20 ప్రపంచ కప్‌కు రోహిత్ కెప్టెన్‌గా ఉండాలని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ మంచి ఫామ్‌లో ఉంటే టి20 జట్టుకు అతడిని సెలెక్ట్ చేయాలని బిసిసిఐని గంభీర్‌ కోరారు. వయసు ఆధారంగా ఓ ప్లేయర్‌ను జట్టు నుంచి తప్పించడం మంచిది కాదని సూచించారు. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగతమని, తాను చెప్పలేనన్నారు. టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. దక్షిణాఫ్రికాతో ఇవాళ టీమిండియా టి20 మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం సూర్యకుమార్ టి20కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వన్డే జట్టుకు రాహుల్, టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News