Monday, December 23, 2024

వదిన స్నానం చేస్తుండగా మరిది వీడియో రికార్డు… భార్యను వదిలేసిన భర్త

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: వదిన స్నానం చేస్తుండగా మరది వీడియో చిత్రీకరించడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను భర్త వదిలిపెట్టిన సంఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని శాటిలైట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 27 ఓ యువతి, యువకుడిని పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చింది. అత్తమామ, మరదిలో కలిసి భార్య భర్తలు ఉంటున్నారు. నవంబర్ 26న ఆమె స్నానం చేయడానికి బాత్రూమ్‌కు వెళ్తుండగా అర్జెంట్ అని చెప్పి ఆమె మరిది బాత్రూమ్‌లోకి వెళ్లాడు. ఐదు నిమిషాలు తరువాత బయటకు వచ్చాడు. ఆమె స్నాన్నం చేస్తుండగా ఓ ఫోన్ కనిపించడంతో మరిచిపోయిఉంటాడని భావించింది. వీడియో కెమెరా ఆన్ చేసి ఉంది.

ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియో రికార్డు కావడంతో భర్తకు ఈ విషయం చెప్పడంతో తమ్ముడిని దెబ్బలు కొట్టి ఇలాంటివి చేయకూడదని హెచ్చరించాడు. ఆమె అత్తమామలు తన కుమారుడికి బుద్ధి చెప్పాల్సిందిపోయి అతడికే సపోర్ట్ చేశారు. ఇలాంటి ఇంట్లో తనకు ఇబ్బందలు వస్తాయని గ్రహించి మరో ఇల్లు మారుదామని భర్తకు ఆమె సూచించింది. దీంతో అత్త ఆమెను పలుమార్లు తిట్టింది. వీడియో రికార్డు చేసినందుకు కోపం ఎందుకు వ్యక్తం చేశావని, అత్యాచారం చేయలేదు కదా? అని కోడలిని అత్త దెప్పిపొడిచింది. భర్త కూడా ఆమెపై ఆగ్రహ వ్యక్తం చేయడంతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో డిసెంబర్ 1న స్థానిక పోలీస్ స్టేషన్ మరిది, అత్తమామలు, భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెతో వివాహాన్ని రద్దు చేసుకుంటానని భర్త పేర్కొన్నారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News