Saturday, November 16, 2024

ఉచిత పథకాలు వ్యయ ప్రాథాన్యతలను వక్రీకరిస్తాయి: జగ్‌దీప్ ధన్‌ఖర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉచిత పథకాలు వ్యయప్రాధాన్యతలను వక్రీకరిస్తాయని ఈ ఉచిత పథకాల పేరుతో జరుగుతున్న పోటాపోటీ రాజకీయాలపైన, దీర్ఘకాలంలో దీని ఫలితాలపైనా దేశ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉందని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’ లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉచిత పథకాలతో ప్రజల జేబులకు భరోసా ఇవ్వడం సరికాదని, ప్రజల జీవన శైలి, సమర్ధత, నైపుణ్యాలను మెరుగుపర్చాలని అభిప్రాయపడ్డారు. భారత్ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదన్నారు.

మన నాగరికత, రాజ్యాంగ రూపకల్పన అనేవి మానవ హక్కులను గౌరవించడం, పరిరక్షించడం, పెంపొందించడంలో మన నిబద్ధతను చాటి చెబుతున్నాయని, ఇది మన డీఎన్‌ఏ లోనే ఉందని పేర్కొన్నారు. ఉచితాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు. “అమృత్‌కాల్ ” సమయం లోనే యూనివర్శల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75 వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్‌దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ లోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్ పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్‌పర్శన్ జస్టిస్ (రిటైర్డ్) అరుణ్‌కుమార్ మిశ్రా తీవ్రవాదం, ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులపై దాని ప్రభావం తీవ్రమైన సమస్యగా ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News