Saturday, September 21, 2024

సోమవారం రాశి ఫలాలు 11-12-2023

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. రుణాలు కొంతవరకు చేస్తారు. జీవితభాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.

వృషభం – నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. వాహన సౌఖ్యం.

మిథునం – బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ, సహకారాలు అందుతాయి.

కర్కాటకం – అనుకోని ఆహ్వానాలు అందుకొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. వస్తులాభం.

సింహం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు ఆభరణలు కొనుగోలు చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు.

కన్య – మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనయోగాలు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం.

తుల – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు.

వృశ్చికం – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.

ధనున్సు – భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పాతమిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు.

మకరం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. వివాదాలకు దూరంగా వుండండి. సేవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ధనలాభం.

కుంభం – చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమాధికం. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు. వస్తులాభం.

మీనం – దీర్ఘకాలిక సమస్య తీరి ఊరట చెందుతారు. సోదరుల నుండి ధన లాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహనయోగం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News