Monday, December 23, 2024

బిజెపి  శాసనసభాపక్ష నేతగా రాజాసింగ్‌కే ఛాన్స్ !

- Advertisement -
- Advertisement -

రెండు రోజుల్లో పార్టీ ప్రకటించే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర బిజెపి ఎల్పీ పక్ష నాయకునిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను నియమిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గ్రేటర్ నగరంలో అదే నియోజకవర్గం నుంచి 2014 నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ఈనేపథ్యంలో హైకమాండ్ రాజాసింగ్‌ను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్పీ నేత నియామకం విషయంలో పార్టీలో రెండు నుంచి సందిగ్ధత నెలకొంది.

ఈఎన్నికల్లో 8 మంది గెలుపొందడంతో ఆసారి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పాటు కామారెడ్డిలో కెసిఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు వినిపించాయి. పార్టీ పెద్దలు చివరకు రాజాసింగ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. బిజెపి ఎల్పీనేత ఎంపిక చేయడంపై స్పష్టత ఇవ్వకపోవడంపై రాజాసింగ్ అలకబూనిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ప్రకటన చేస్తారని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News