- Advertisement -
నిజామాబాద్ : కిలో చికెన్ వంద రూపాయలకే అంటే జనం ఊరుకుంటారా.. పోటీలు పడి మరీ చికెన్‌ను చౌకధరకు కొనిగోలు చేసేందుకు ఎగబడ్డారు. అయితే, చికెన్ ఇంత అగ్గువగా దొరకడానికి కారణం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి బిజెపి తరఫున పోటీ చేసిన ధన్‌పాల్ సూర్యనారాయణ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బిజెపికి ఓటు వేసి గెలిపించిన ఇందూరు నగర ప్రజలకు ఇందూరు వీక్ల్లీ మార్కెట్‌లోని శ్రీ గంగా భవాని క్వాలిటీ చికెన్ మార్ట్ యజమాని, బిజెపి అభిమాని బానాల ప్రణీత్ ఆదివారం ఒక్కరోజు మాత్రమే కేవలం వంద రూపాయలకే కిలో చికెన్ విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న జనం చికెన్ మార్ట్‌కు పెద్ద సంఖ్యలో హాజరై కొనుగోలు చేశారు. ఆదివారం దాదాపు 2వేల కిలోల చికెన్ అమ్మినట్లు యజమాని తెలిపారు.
- Advertisement -