Saturday, December 21, 2024

అప్పుడే నిలదీస్తారా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లడమే కాకుండా అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రైతు బంధు నిధులను జమ చేశారా? అని మాజీ మంత్రి హరీ శ్ రావు ప్రశ్నించడం న్యాయంగా లేదని ముగ్గురు రాష్ట్ర మంత్రులు ధ్వజమెత్తారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారి గా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. ఈ సం దర్బంగా వారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడా రు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఐదున్నర లక్షల కో ట్ల అప్పులు మిగిల్చి, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి తమ ప్రభుత్వానికి ఖాళీ ఖజాను అప్పగించిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చి రెండు రో జులు గడవక ముందే రైతు బంధు నిధులను జమ చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించడం సమంజసంగా లేదని మండిపడ్డారు. తొ మ్మిదిన్నర ఏళ్లుగా రాష్ట్ర సంపదను గత ప్రభుత్వ ముఖ్యులంతా కొల్లగొట్టారని ఆరోపించా రు. గత ప్రభుత్వం రైతు బంధు నిధులను జమ చేయడానికి మూడు నెలలు గడువు తీసుకునేదని, తాము అధికారంలోకి వచ్చి రెండు రోజులు కాలేదని, అప్పుడే గురువిందలా మాట్లాడటం తగదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనావాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్ర ఆర్థ్ధిక ప రిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంపదను సృష్టిం చి, ఆ సంపదను బడుగు, బలహీన వర్గాలకు పం పిణీ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎ న్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తూ.చ. తప్పకుండా అమలు చేసి ప్రజల నమ్మకా న్ని, విశ్వసనీయతను నిలుపుకుంటామన్నారు.

ఇందిరమ్మ రాజ్యం గురించి విమర్శించడం తగదు
తొమ్మిదినర్న ఏళ్లలో డబుల్ బెడ్ రూంలు ఇవ్వనివారు ఇందిరమ్మ రాజ్యం గురించి విమర్శించడం తగదన్నారు. దుర్వినియోగం అయిన నిధులను రికవరీ చేసి ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, వంద రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రతి సంస్థ ప్రజల కోసం పనిచేస్తుందని, తమ పీపుల్స్ ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ బస్సులను అసెంబ్లీ ఆవరణలో పండుగ వాతావరణంలో ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ అందించే రెండో గ్యారెంటీని కూడా ప్రారంభించామని అన్నారు.
బిఆర్‌ఎస్‌కు చెంపపెట్టులా గ్యారెంటీల అమలు : మల్లు భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేసిన బిఆర్‌ఎస్ నాయకులకు చెంపపెట్టులాగా బాధ్యత తీసుకున్న రెండు రోజుల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు హామీలను అమలు చేశామని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ళ సమస్య, పోడు భూములు, ఇతర సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. బహుళార్ధ సాధక ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటి పరిశ్రమలు, ఏర్పాటు చేయడంతో పాటు సేవారంగాన్ని కూడా ప్రోత్సహిస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తాడిత, పీడిత, దళిత, గిరిజన, బడుగు బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలకు ఉత్పత్తి రంగాల్లో సృష్టించిన సంపదను పంచుతామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించే విధంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. అందరికీ ఇండ్లు కొలువులు ఇవ్వడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. గత పాలకులు ఖమ్మం జిల్లాకు గోదావరి నది జలాలు తీసుకురావాలన్న చిత్తశుద్ధి లేకపోవడం వల్ల గోదావరి జలాలు జిల్లాకు రాలేదని జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులం కలిసికట్టుగా పనిచేసి ఖమ్మం జిల్లాకు గోదావరి నది జిల్లాలు తెస్తామని, రైతుల కాళ్లు కడుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా బ్రతికే జీవితాన్ని గడపడం కోసం ప్రజాపాలన అందిస్తామన్నారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ఇంటి స్థలాలు ఇచ్చామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కారానికి కోర్టు అనుమతులు ఇచ్చినప్పటికీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టిందన్నారు. ఖమ్మంలో 10 అసెంబ్లీ స్థానాలకుగాను తొమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన జిల్లా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాం : తుమ్మల
అనేక లోటుపాట్లు, అవకతవకలతో కూడిన ఆర్థ్ధిక పరిస్థితిని చక్కదిద్ది ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. అటు ఆర్థ్ధికంగా, ఇటూ 85వేల కోట్ల అప్పులు మిగిల్చిన విద్యుత్ శాఖలు చేపట్టిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఒక విధంగా ఈ రెండు శాఖలు ముళ్ళ కిరీటాలని, రెండు కష్టమైన శాఖలు ఆయనకే దక్కాయని, అయినప్పటికీ సమర్ధుడైన మల్లు భట్టి వాటిని అధిగమిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు. డిప్యూటి సిఎం భట్టి ఆర్థ్ధికంగా సహకరించి, సక్రమంగా విద్యుత్‌ను అందిస్తే మరో మంత్రి పొంగులేటి రెవెన్యూ మంత్రిగా భూములు ఇస్తే తాను వ్యవసాయ శాఖ మంత్రిగా సుభిక్షంగా వ్యవసాయం చేసి తీరుతామన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు కబ్జాలు, అక్రమ పోలీసుల కేసులు లేని ప్రశాంతతో కూడిన పాలనను అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News