- Advertisement -
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం జిల్లాలోని రాయపర్తి మండలం కృష్ణాపురం క్రాస్ రోడ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్రవాహనం.. రోడ్డు ప్రక్క ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను సంగెం మండలం ఎల్గూరు రంగంపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోద చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -