Friday, December 20, 2024

కార్తికమాస చివరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఈరోజు కార్తికమాసం చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తెలంగాణలోని వేములవాడ, యాదగిగుట్ట, భద్రాచలంతోపాటు శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు చేసి ఆలయాల ప్రాంగాణాల్లో దీపాలు వెలిగిస్తున్నారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు చేస్తున్నారు.

ఇక శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ నెలకొంది.ఇక, విజయవాడ కనుకదుర్గమ్మ ఆలయంలో భక్తుల కోలాహాలం నెలకొంది. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో దీపాలు వెలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News