Sunday, November 24, 2024

రింకును కోతి కరవడంతో అలా చేస్తాడు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియాలో టి20 జట్టు అంతా కుర్రాళ్లతో నిండిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సూర్యకుమార్ కెప్టెన్సీలో కుర్రాళ్లు ధనాధన్ బ్యాటింగ్ చేసి అలరించారు. ప్రతి టి20లోను 200 పైగా పరుగులు చేసి ధాటిగా ఆడారు. టీమిండియా బ్యాట్స్‌మెన్ రింకుసింగ్ చివరలో దంచికొడుతున్నారు. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా ఫీల్డింగ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా జట్టు సభ్యుడు రింకు బిసిసిఐ ఇంటర్వూలో మాట్లాడాడు. రింకు వేగంగా కదలడానికి కారణం కోతి కరవడమే కారణమని శుభ్‌మన్ గిల్ సరదాగా వెనుక నుంచి వాఖ్యానించడంతో అందరూ నవ్వుకున్నారు.

భారత్ వికెట్లతో పోలిస్తే సపారీల గడ్డ మీద బౌన్స్ అధికంగా ఉండడంతో పాటు పేస్ కూడా ఎక్కువగా ఉంటుందని రింకు చెప్పారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ కలిసి పని చేయడం గొప్పగా అనిపించడంతో పాటు తనదైన శైలిలో ఆడమని సలహాలు ఇస్తాడని, స్వీయ నమ్మకం ముఖ్యమని పలుమార్లు చెప్పాడని గుర్తు చేశారు. బ్యాటింగ్‌లో ఐదు, ఆరు స్థానాల్లో ఆడటం కష్టమని, నమ్మకంతో ముందుకు సాగాలని చెప్పారు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ నుంచి ఐదు, ఆరు స్థానాల్లో ఆడి రింకు గొప్పగా రాణించారు. నాలుగు ఐదు వికెట్లు పడిన తరువాత భాగస్వామ్యం రింకు నమోదు చేయడంతో పాటు కఠినమైన పట్టుదలతో సాగుతాడని, ఎంతో ప్రశాంతంగా ఉంటే అంతా బాగా ఆడగలనని అతడు చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News