Monday, December 23, 2024

మా నాన్న మళ్లీ తండ్రి కాబోతున్నాడు: ముఖ్యమంత్రి కుమార్తె సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

తన తండ్రి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ మళ్లీ తండ్రి కాబోతున్నాడంటూ అతని కుమార్తె సీరత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీరత్.. భగవంత్ మొదటి భార్య కుమార్తె. భగవంత్ తన మొదటి భార్య ఇందర్ ప్రీత్ కౌర్ నుంచి విడాకులు తీసుకుని, మరో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు సీరత్ తోపాటు దోషన్ అనే కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం భగవంత్ రెండో భార్య గర్భవతి అని, తన తండ్రి మూడో బిడ్డకు తండ్రి కాబోతున్నాడని సీరత్  తెలిపింది.

ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సీరత్ ఒక వీడియో చేసింది. ఈ వీడియోను ఆమె తల్లి ఇందర్ ప్రీత్ కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పంజాబీ భాషలో ఉన్న ఈ వీడియోను అందరికీ అర్ధమవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఇవ్వడం విశేషం. గతంలో తన సోదరుడు దోషన్ తండ్రిని కలవడానికి వెళ్తే, రానివ్వలేదని ఆమె ఆరోపించారు. సొంత పిల్లల బాధ్యత పట్టించుకోని వ్యక్తి, పంజాబ్ ప్రజల బాగోగులు ఏం చూస్తాడని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటికీ అధికారిక కార్యక్రమాలకు కూడా తన తండ్రి పూటుగా తాగి వెళ్తారని, గురుద్వారా సాహెబ్ కు కూడా తాగిన మత్తులోనే వెళ్తారనీ ఆమె ఆరోపించింది.

ఈ వీడియోను బీజేపీ నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా షేర్ చేస్తూ, ఈ ఆరోపణలపై స్పందించాలని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరారు. ‘భగవంత్ మాన్ పై కూతురు చేసిన ఈ ఆరోపణలపై మీరు స్పందిస్తారా లేక ఆయనతో కలసి ఇసుక డబ్బును కాజేస్తూ మౌనం వహించి కూర్చుంటారా?’ అని నిలదీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News