Tuesday, December 24, 2024

ఉద్యోగ నియామకాలపై ముందడుగు వేసిన రేవంత్

- Advertisement -
- Advertisement -

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీల భర్తీ చేపడతామని మేనిఫెస్టోలో  ప్రకటించడమే కాకుండా, ఏయే రోజున ఏయే నోటిఫికేషన్లు విడుదల అవుతాయో వివరంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలపాలని టిఎస్ పిఎస్ సి చైర్మన్ జనార్దనరెడ్డిని సిఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్ని ఖాళీలు భర్తీ అయ్యాయో కూడా తెలపాలన్నారు. ఉద్యోగాల భర్తీపై రెండు రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామనీ, దీనికి పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆయన టీఎస్ పిఎస్ సి చైర్మన్ ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News