Monday, December 23, 2024

బిఆర్ఎస్ పాలన నచ్చక కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు: పొన్నం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: బిఆర్‌ఎస్ పదేళ్ల పాలన నచ్చక కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రిగా పొన్నం ప్రభాకర్ మొదటిసారిగా సిద్ధిపేటకు వచ్చారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పొన్నానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిసి బంధుపై సమీక్షించి ఆలోచన చేస్తామని, మూడు రాష్ట్రాల్లో గెలిచినా ఇప్పటికి బిజెపి సిఎంలను నియమించలేదని పొన్నం చురకలంటించారు. విద్యుత్‌శాఖలో రూ.85 వేల కోట్లు అప్పు ఉందని, తెలంగాణలో ఉన్న ప్రతి శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఆర్‌టిసి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News