Saturday, November 23, 2024

విద్యార్థులకు చదువులతోపాటే సంపాదన

- Advertisement -
- Advertisement -

హార్టీకల్చర్ వర్శిటీ విసి

మనతెలంగాణ/హైదరాబాద్:  విద్యార్థులకు చదువుతో పాటే ఆదాయం సంపాదించుకునే మార్గాలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ అన్నారు. నిజాయితీ, నిబద్ధతతోనే ఏ రంగంలోనైనా విజయం సాధించగలమన్నారు. చదువుతో పాటే ఆదాయం సంపాదించగలిగే అవకాశం కల్పిస్తే మరింత దీక్షతో విద్యార్థులు విద్యనభ్యసిస్తారని, విజయాలు సాధిస్తారని చెప్పారు. భారతదేశంలో ఉన్న పుష్కలమైన యువత దేశానికి వనరుగా ఉంటుందని, ప్రపంచంలో ఏ దేశానికి లేని బలం ఇదని, 2047 నాటికి సాకారం కాబోయే వికసిత్ భారత్ కు భూమిక ఇదే అన్నారు. సోమవారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన వికసిత్ భారత్ లాంచింగ్ కార్యక్రమంలో వైస్ చాన్సర్ డాక్టర్ నీరజ పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పానెల్ డిస్కషన్ లో వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ మాట్లాడుతూ… ఉద్యాన పంటల్లో ఆవిష్కరణలు, అటు రైతులకు నికర లాభాలు అందించడంతోపాటు దేశ స్థూల జాతీయోత్పత్తికి ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్ గా ఉంటుందని ఆమె అన్నారు. విశ్వవిద్యాలయాలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ఏర్పడాలని కోరారు. ఆవిష్కరణల భారత్ గా దేశానికి ఎంతో భవిష్యత్తు ఉందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం నుండి రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, కళాశాల అసోసియేట్ డీన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News