Monday, December 23, 2024

ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశాం: డిసిపి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరోః తెలంగాణ రాష్ట్ర మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్లు మాయం కావడంపై విచారణ వేగవంతం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డీసీపీ తన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో డైరక్టర్‌ను విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్లు, ఫర్నీచర్ మిస్సింగ్‌పై దర్యాప్తు చేస్తున్నాం. పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మిస్సింగ్ చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్‌పై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. కళ్యాణ్‌తో పాటు డైరెక్టర్‌ను విచారణ చేసి,

స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కార్యాలయాల్లో ఫర్నిచర్ మిస్సింగ్‌పై కూడా కేసు నమోదు చేశామని, అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయంలో బీర్వాలు మిస్సింగ్‌పై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. విద్యా శాఖలో జరిగిన సంఘటన పై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. వీటిల్లో మాజీ మంత్రుల ప్రమేయం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణలో ఎవరి ప్రమేయం ఉన్న చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News