Monday, December 23, 2024

ఎన్నికైన ప్రభుత్వం తోనే సమస్యల పరిష్కారం

- Advertisement -
- Advertisement -

జమ్ము : ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడాన్ని జమ్ము లోని వాణిజ్య, పారిశ్రామిక వేత్తలు స్వాగతించారు. ఇక త్వరలో రాష్ట్రంగా జమ్ము కశ్మీర్ అవతరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ప్రభుత్వం ఏర్పడాలని తాము ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. అయితే కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌ను తక్కువ చేయడాన్ని తాము కోరుకోవడం లేదని, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిపించడానికి, రాష్ట్రంగా ఏర్పాటుకాడానికి సుప్రీం కోర్టు వ్యవధిని నిర్ణయించడం అత్యంత ప్రశంసనీయమని జమ్ము చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు అరుణ్ గుప్తా పేర్కొన్నారు. ప్రస్తు త బ్యూరోక్రాట్ పాలనలో తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని,

లోక్‌సభ ఎన్నికలతోపాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకంగా చాంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఫెడరేషన్ జమ్ము అధ్యక్షుడు నీరజ్ ఆనంద్ ప్రశంసించారు. దేశంతో పూర్తిగా విలీనం కావాలని తాము కోరుకుంటున్నామని, ఇది ప్రజలందరి అభిమతమని తెలిపారు. గత 70 ఏళ్లుగా దేశం లోని ఇతర ప్రాంతాల కన్నా వెనుకబడి ఉన్న జమ్ముకశ్మీర్ ప్రజలకు సుప్రీం నిర్ణయం మేలి మలుపని అభివర్ణించారు. జమ్ము ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ లాంగర్ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం ఆదేశించడం తమకు ఆనందం కలిగిస్తోందన్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే తమ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News