తమ జట్టు ఓడిపోయిందన్న కోపంతో రిఫరీపై దాడి చేశాడొక ప్రబుద్ధుడు. టర్కిష్ ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
అంగరగుచు, రైజెస్పోర్ జట్ల మధ్య సోమవారంనాడు సూపర్ లీగ్ మ్యాచ్ హోరాహోరీ సాగింది. అంగరకుచు జట్టు గోల్ చేసి 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ మరికొన్ని నిమిషాలలో ముగుస్తుందనగా రైజెస్పోర్ 97వ నిమిషంలో గోల్ చేసి, స్కోరును సమం చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తమ జట్టు ఓడిపోయిందన్న ఉక్రోషంతో అంగరగుచు జట్టు అధ్యక్షుడు ఫరూఖ్ కోకా మైదానంలోకి దూసుకొచ్చి, రిఫరీ హలీల్ ఉముట్ మెలెర్ మొహంపై పంచ్ విసిరాడు. దాంతో రిఫరీ కంటి కింద తీవ్ర గాయమైంది. ఈ సంఘటన అనంతరం టర్కిష్ ఫుట్ బాల్ ఫెడరేషన్ అన్నిలీగ్ మ్యాచ్ లనూ రద్దు చేసింది.
Ankaragücü Başkanı Faruk Koca'nın Halil Umut Meler'e saldırdığı anlar. pic.twitter.com/6zUELDZsVN
— BurakSakinOl (@buraktut_) December 11, 2023