Monday, December 23, 2024

జనవరిలో పంచాయతీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈమేరకు డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, 21, 25, 30 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ యోచన. ఎన్నికల నిర్వహణకోసం పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు కొనసాగుతోంది.

అర్హులు ఎవరంటే…?

  • సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరికి మించి సంతానం ఉండకూడదు.
  • 1995, జూన్ 1 తర్వాత మూడో సంతానం ఉంటే అనర్హులు.
  • ఒక కాన్పులో ముగ్గురు పుట్టిన సందర్భాల్లో అర్హులే.
  • పోటీ చేసేందుకు కనీస అర్హత 21 ఏళ్లు
  • అభ్యర్థి తను పోటీ చేసే గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి.
  • వార్డు మెంబర్ లేదా సర్పంచ్ పదవికి అభ్యర్థిని ప్రతిపాదించేవారు అదే వార్డు లేదా గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి.
  • రేషన్ డీలర్లు, అంగన్వాడీ వర్కర్లు పోటీకి అనర్హులు.
  • స్థానిక సంస్థల ఉద్యోగులు, ఆశా వర్కర్లు పోటీకి అనర్హులు.
  • ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి, ధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్ల లోపు అందజేస్తే పోటీకి అర్హులు.

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News