కాంగ్రెస్ పార్టీ రహమత్‌నగర్ కార్పొరేటర్‌కు ఫోన్ చేసి బెదిరిస్తున్న వ్యక్తిపై మధురానగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… రహమత్‌నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాడు. దీంతో అప్పటి నుంచి బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు విజయ్ సింహా కార్పొరేటర్‌కు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు.
దీంతో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మధురానగర్ పోలీసులు విజయ్‌సింహాపై కేసు నమోదు చేశారు. ఐపిసి 506 కింద కేసు నమోదు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరినందుకు తనపై కక్ష సాంధింపు చర్యలకు పాల్పడుతున్నారని కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ నాయకుడు విజయ్ సింహాతో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. గతంలో కూడా విజయ్‌సింహాపై బోరబండ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.