- Advertisement -
జమ్మూ : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వెస్ట్‌పాకిస్థానీ శరణార్ధులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్‌ఎస్ పురా ప్రాంతంలో వందలాది శరణార్థులు గుమికూడి తీర్పుపై సంబరాలకు దిగారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్టికల్ 370 ఇక పూర్తిగా ముగిసిన ఘట్టం అయిందని, ఇందుకు న్యాయస్థానానికి ధన్యవాదాలుతెలియచేస్తున్నామని శరణార్థులు తెలిపారు. ఇక తాము అసెంబ్లీ ఎన్నికలలోఓటింగ్‌కు వీలేర్పడుతుందని, ఈ విధంగా ఇక్కడి జనజీవితంలో పాలుపంచుకుంటామని శరణార్థులు సంబరానికి దిగారు.
- Advertisement -