Monday, December 23, 2024

యుఎన్ మాజీ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్‌కి దీపావళి పవర్‌ఆఫ్ వన్ అవార్డు

- Advertisement -
- Advertisement -

అవార్డు గ్రహీతల్లో మరో ముగ్గురు దౌత్యవేత్తలు

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, మరో ముగ్గురు అనుభవజ్ఞులైన దౌత్యవేత్తలకు దీపావళి పవర్ ఆఫ్ వన్ అవార్డ్‌తో ఐక్యరాజ్య సమితిలో సత్కారం లభించింది. 2023 సంవత్సరానికి గాను బాన్‌కీ మూన్‌తోపాటు బోస్నియా, హెర్జెగోవినా మాజీ శాశ్వత ప్రతినిధి యుఎన్ రాయబారి మిర్సాదా కొలకోవిక్, యుఎన్ రాయబారి కిమ్‌సూక్‌కు, దక్షిణ కొరియా మాజీ శాశ్వత ప్రతినిధి , 72 వ యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు , బెల్గ్రేడ్ ప్రిస్టినా డైలాగ్ కోసం ఈయు ప్రత్యేక ప్రతినిధి మిరోస్లావ్ లజ్కాడ్‌లకు ఈ అవార్డులు లభించాయి.

దౌత్యం యొక్క ఆస్కార్స్‌గా ప్రసిద్ధి పొందిన ఈ అవార్డులను అమెరికాకు చెందిన దివాళీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 2023 దీపావళి స్టాంప్‌గా వ్యవహరిస్తున్నారు. ది పవర్ ఆఫ్ వన్ అవార్డు వేడుకలో యుఎన్ మాజీ ఛీఫ్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. సహాయ కార్యక్రమాల్లో వీరి నిస్వార్థ ప్రయత్నాలు, అందరికీ పరిపూర్ణమైన, శాంతియుత, సురక్షిత ప్రపంచాన్ని ఏర్పర్చడానికి వీరు చేసిన కృషికి ఈ అవార్డులతో సత్కరించినట్టు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News