Monday, November 18, 2024

దేశ వ్యాప్తంగా వృద్దుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వృద్దుల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా మొత్తంగా 10 వృద్ద శరణాలయాలను దత్తతకు తీసుకుని 1000 మంది వృద్దుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. సందర్భంగా ఆస్టర్ డియం వ్యవస్థాపక ఛైర్మన్ డా. ఆజాద్ మూపెన్ మాట్లాడుతూ క్లినిక్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు తమ సంస్ధ సమాజానికి తిరిగి ఇవ్వాలని పెట్టుకొన్న నియమానికి అనుగుణంగా పని చేస్తుందని చెప్పారు. ఆస్టర్ వాలంటీర్స్ ద్వారా ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు.

వృద్దుల సంక్షేమ కార్యక్రమంతో పాటూ భారతదేశం, బంగ్లాదేశ్, టాంజానీయ, సిరియా, మొరాకో దేశాలలో నేటి నుండి 7 అత్యాధునిక మొబైల్ క్లినిక్‌లను కూడా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే భారత దేశంలోని తమ నెట్ వర్క్ హాస్పిటల్స్ ద్వారా వృద్దాశ్రమాలను ఎంపిక చేయడం జరుగుతుందని కనీసం 1000 మంది వృద్దులకు ఈ సంవత్సరం నుండే ఆరోగ్య సంరక్షణ అమలు చేయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. వాలంటీర్స్ ద్వారా గత సంవత్సరం 2వేలకు పైగా మొక్కలను దేశ వ్యాప్తంగా నాటడడం జరిగిందన్నారు. రానున్న సంవత్సరంలో కనీసం 3500 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుని పర్యావరణ పరిరక్షణ కోసం సౌర విద్యుత్తు వినియోగం పెంచాలని నిర్ణయించినట్లు, దేశ ప్రజల హితం కోసం నిరంతరాయం పని చేస్తున్నట్లు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News