Monday, December 23, 2024

జేన్‌కో ఏఈ పరీక్ష వాయిదా

- Advertisement -
- Advertisement -

త్వరలో తేదీ ప్రకటిస్తాం
జెన్‌కో అధికారులు
మన తెలంగాణ / హైదరాబాద్: ఈ నెల 17న నిర్వహించనున్న టిఎస్ జెన్‌కో నిర్వహించినున్న ఏఈ(ఎలక్ట్రికల్,మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజున ఇతర ప్రభుత్వ పరీక్షల నిర్వహణ కోసం( సెప్టెంబర్ 2023లో) నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఇతర ప్రభుత్వ పరీక్షలు ఉన్న నేపథ్యంలో జెన్‌కో పరీక్షను వాయిదా వేయాలని ఆర్దిక,ప్లానింగ్ విద్యుత్‌శాఖ అధికారులకు పలు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జెనోకో ఆద్వర్యంలో నిర్వహించనున్న ఏఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన తేదీని త్వరలో తెలియచేస్తామని ఇందుకు సంబంధించిన సమాచారాన్ని www.tsgenco.co.in అనే వెబ్‌సైట్‌ను సంపద్రించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News