Sunday, December 22, 2024

చెట్టును ఢీకొట్టిన కారు : యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారు చెట్టును ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం మునిపామ్ల గ్రామానికి చెందిన బొడ్డు అజయ్ (21) గత రెండు నెలలుగా నగరంలోని యూసుఫ్‌గూడలోని కుమార్ ఫోటో స్టూడియోలో ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం కాప్రాలోని యాప్రాల్ చెందిన అర్జున్‌తో పాటు అజయ్, కిరణ్, పృద్వీ, కృష్ణ, చరణ్‌లతో కలిసి హన్మకొండలో జరిగిన వివాహా వేడుకలో ఫోటోలు తీసి అర్థరాత్రి కారు (టిఎస్ 26 హెచ్ 3777)లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

అర్జున్ కారు నడుపుతుండగా అజయ్ ముందు సీ టులో కూర్చున్నాడు. మంగళవారం తెల్లవారు జా మున యాద్గార్‌పల్లి చౌరస్తా సమీపంలోకి రాగానే కారు ప్రమాద వశాత్తు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడి కక్కడే మృతి చెందగా మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కీసర పోలీసులు క్షత్ర గాత్రులను చికిత్స ని మి త్తం ఇసీఐఎల్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మే రకు పోలీసు లు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చే స్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News