హైదరాబాద్: ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనా ఆంద్రప్రదేశ్ రాష్ష్రంలోని మొగల్తూరు మండలం జగన్నాథపురం లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు పోలుమాట శ్రీనివాసరావు, చోరపల్లి వీరబాబు,యల్లమిల్లి రవి కుమార్ తీపర్రుకు చెందిన వ్యాపారి వద్ద కోళ్లకు గూడులు అల్లి జీవిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి కోళ్ల గూడులను ఆటో లో తీసుకెళ్తుండగా
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం జగన్నాథపురం లో జాతీయ రహదారి 216 పై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాసరావు,రవి కుమార్ తీవ్రగాయాలతో ఘటనా స్థలిలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వీరబాబు ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.