Monday, December 23, 2024

ఇప్పుడే ఆట మొదలు

- Advertisement -
- Advertisement -

సాధ్యం కానీ హమీలు ఇచ్చి
కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టింది
అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే
రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న
రాహుల్ గాంధీ హామీ ఏమైంది
తొలి కేబినెట్ భేటీలోనే ఆరు గ్యారెంటీలకు
చట్టబద్ధత కల్పిస్తామన్న మాట ఏమైంది
లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా…?
హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా..?
మీడియా చిట్‌చాట్‌లో
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఎ కెటిఆర్

అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? తొలి కేబినెట్
భేటీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు.. అది ఏమైంది? లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా.. హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? మీడియా చిట్‌చాట్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఎ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : సాధ్యం కానీ హమీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఎ కెటిఆర్ ఆరోపించారు. అలవి కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలైన ఆట అని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ కెటిఆర్ నామినేషన్‌పై సంతకం చేశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరగలేదన్నారు. కాగ్ ప్రతి ఏడాది నివేదికలు ఇస్తుందని, ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నారని చెప్పారు. తాము ఏటా పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని గుర్తు చేశారు.

లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా…? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా..? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు. తొలి కేబినెట్ భేటీలోనే ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న మాట ఏమైందని, హామీలిచ్చినపుడు ఆ సంగతి తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరుగలేదని అన్నారు. ప్రతి ఏడాది కాగ్ నివేదికలు ఇస్తున్నారని, అదేవిధంగా ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని ఆయన వివరించారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని కెటిఆర్ గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు అప్పగించారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని విమర్శించారు. ఒక ఎంఎల్‌ఎ తన నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలిస్తామన్నారని, అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వట్లేదని ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని చెప్పారు. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అప్పుల కుప్ప చేశారని, గురువారం గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెబుతారని విమర్శించారు.

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం :ఎంఎల్‌ఎలతో కెటిఆర్

ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు, పార్టీ నేతలతో కెటిఆర్ చెప్పారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. నాడు అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో, నేడు ఓడిన తర్వాత కూడా అంతే బాధ్యతగా ఉంటామని కెటిఆర్ తెలిపారు. ఈ ఎదురుదెబ్బను పాఠంగా నేర్చుకొని, ఓటమికిగల కారణాలను లోతుగా విశ్లేషించుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఈ ఫలితాలపై నేతలు, కార్యకర్తలు ఎటువంటి నిరాశపడొద్దని, ఇది పార్టీకి తాత్కాలికి బ్రేక్ మాత్రమేనని ధైర్యం చెప్పారు. ఈ అయిదేళ్లలో 100 శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తామని మాజీ మంత్రి కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News