Monday, December 23, 2024

రాగి సంగటిలో సైనేడ్ కలిపి భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రాగిసంగటిలో సైనేడ్ కలిసి భార్యను భర్త హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దర్శన్ అనే వ్యక్తి(34) ఏడు సంవత్సరాల క్రితం శ్వేతను(32) పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ల్యాబ్ టెక్సిషియన్లు కావడంతో బెంగళూరు, శివమొగ్గలో ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. దర్శన్ మరో యువతితో చనువుగా ఉండడంతో భార్య పలుమార్లు అతడిని మందలించింది. అతడిలో మార్పు రాకపోవడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి భార్యతో ప్రేమతో ఉన్నట్లు నటించాడు. తొమ్మిదో తేదీ రాత్రి భార్యకు రాగి సంకటిలో ఓ రసాయనాన్ని కలిపి తినిపించాడు.

ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత ఆమె కుటుంబ సభ్యులకు గుండెపోటుతో చనిపోయిందని సమాచారం ఇచ్చాడు. ఆమె పుట్టింటి వారికి అనుమానం రావడంతో దర్శన్ నిలదీయడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పారిపోయిన భర్తను పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తొలుత సిరంజి ద్వారా రసాయనాన్ని ఎక్కించి చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రయోగం ఫలించకపోవడంతో రాగి సంగటిలో రసాయనాన్ని కలిపి ఆమెకు తినిపించడంతో మృతి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News