హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న ఫేక్ వార్తలను సీనియర్ ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కొట్టిపారేశారు. స్మితా తన ట్విట్టర్‌లో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని వివరణ ఇచ్చారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఎస్‌గానే విధులు నిర్వహిస్తానని స్మితా పేర్కొన్నారు. తెలంగాణ ప్రయాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు స్మితా సిఎంఓగా విధులు నిర్వహించడంతో పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయం విధితమే. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె కలువకపోవడంతో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి సీనియర్ ఐఎఎస్‌లు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్తారని విశ్రాంత ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి పరోక్ష విమర్శలు చేశారు. దేశంలో మొత్తంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పరిశీలించడంతో ఏకైక ఆఫీసర్ ఆమేనని ఘాటుగా తన ట్విట్టర్ మురళీ స్పందించిన విషయం తెలిసిందే.
ఆ వార్తలను నమ్మకండి: స్మితా సబర్వాల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -