Sunday, December 22, 2024

సౌతాఫ్రికా-ఎ తో ఇండియా-ఎ తొలి టెస్టు డ్రా

- Advertisement -
- Advertisement -

పొచెఫ్‌స్ట్రోమ్: సౌతాఫ్రికాఎతో జరిగిన తొలి టెస్టును ఇండియాఎ డ్రాగా ముగించింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. రుబిన్ హెర్మాన్ 15 ఫోర్లతో 95 పరుగులు చేశాడు. జీన్ డుప్లెసిస్ (106) సెంచరీతో ఆకట్టుకున్నాడు. వికెట్ కీపర్ కొన్నర్ 48 పరుగులు సాధించాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ 417 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రదోష్ పాల్ కళ్లు చెదిరే శతకం సాధించాడు.

ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ప్రదోష్ పాల్ 23 ఫోర్లు, ఒక సిక్స్‌తో 163 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ (68), ఓపెనర్ పడిక్కల్ (30) తమవంతు పాత్ర పోషించారు. ధాటిగా ఆడిన శార్దూల్ ఠాకూర్ 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ యాసి వలి 72 (నాటౌట్), డుప్లెసిస్ 50 (నాటౌట్) రాణించారు. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News