Friday, November 22, 2024

శ్రీకృష్ణ జన్మభూమిపై సర్వే

- Advertisement -
- Advertisement -

అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అలహాబాద్ : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో సర్వే నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హిందూ పక్షం శీకృష్ణ విరాజ్‌మాన్ తరఫున దాఖలైన పిటిషన్ పరిశీలించి కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు గురువారం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ముగ్గురు న్యాయవాదులను కమిషనర్లుగా నిర్ణయించింది.వివాదాస్పద మసీద్ కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకృష్ణ విరాజ్ మాన్ తరఫున దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చారు.

ఈ కేసుకు సంబంధించి మధుద డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి బదిలీ అయిన మొత్తం 18 పిటిషన్లను హైకోర్టు పరిశీలించింది. మధుర డిస్ట్రిక్ట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు అన్నింటినీ అందించాలని హైకోర్టు కోరింది. సర్వే చేయించాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు అనుమతించిందని హిందూ పక్షం తరఫున వాదనలు వినిపించిన విష్ణుశంకర్ జైన్ చెప్పారు. సర్వేలో అనుసరించాల్సిన పద్ధతులను ఈనెల 18న ఖరారు చేయనున్నట్టు వెల్లడించారు. షాహీ ఈద్గా మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి అడ్వకేట్ జనరల్ అవసరం. ఇది చరిత్రాత్మకమైన తీర్పు అని విష్ణుశంకర్ జైన్ పేర్కొన్నారు. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి జౌరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరఫున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటిషన్లు దాఖలయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News