- Advertisement -
కారకాస్: వెనుజులా రాజధాని కారకాస్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు అతివేగంగా పలు కార్లను ఢీకొట్టింది. 17 వాహనాలను ఢీకొట్టడంతో మంటల చెలరేగి 16 మంది సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -