- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎంఎల్‌సి షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఎంఎల్‌సి కారును మరో కారు ఢీకొట్టడంతో ఎంఎల్‌సి సాబ్జీ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సాబ్జీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాబీ మృతిపట్ల సిఎం జగన్ మోహన్ రెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ గన్‌మెన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన గన్ మెన్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ఏలూరులో అంగన్ వాడీ కార్యకర్తల సమ్మెలో ఆయన పాల్గొని భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -