హైదరాబాద్: మన రాష్ట్రం పదేళ్లుగా ఎంతో అభివృద్ధి సాధించిందని ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి తెలిపారు. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంపై కడియం శ్రీహరి స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమి లేదన్నారు. ప్రభుత్వం చేసే పని పట్ల స్పష్టత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎన్నో జాతీయ సంస్థలు మన రాష్ట్రానికి అవార్డులు ఇచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలో ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని ప్రశంసించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గవర్నర్ మరిచిపోయారని కడియం శ్రీహరి మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అన్నారని, ఇప్పటివరకు రోడ్‌మ్యాప్ లేదని చురకలంటించారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలపై సరిగా చెప్పలేదని దుయ్యబట్టారు. విధానాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటిస్తే బాగుండేదని కడియం పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం గవర్నర్‌తో అన్ని అసత్యాలు పలికించిందని ధ్వజమెత్తారు.
ఆరు గ్యారంటీలకు రోడ్‌మ్యాప్ లేదు: కడియం
- Advertisement -
- Advertisement -
- Advertisement -