Friday, January 10, 2025

పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై కిషన్ రెడ్డి క్లారిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల పొత్తులపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని ఆయన స్పష్టం చేశారు. ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ముఖ్య అతిథిగా తరుణ్ చుగ్, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరులో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News