Saturday, January 4, 2025

ఈ దేశం అద్దె గర్భపు అడ్డాకాదు: ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశం అద్దెకు గర్భాశయ వ్యాపార పరిశ్రమ కేంద్రం కావాలని ఎవరూ కోరుకోరని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సరోగసీ ప్రక్రియను క్రమబద్థీకరించే చట్టం తీసుకురావడం సముచిత రీతిలోనే జరిగింది. సరోగసీకి ముందుకు వచ్చే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చేయడానికే ఈ చట్టం తీసుకువచ్చారని, భారతదేశం ఏమైనా గర్భాశయ అద్దెల వ్యాపారానికి కేంద్రం కావాలా? ఈ విధంగా మారాలని ఎవరూ కోరుకోరని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ , జస్టిస్ మిని పుష్కరంతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

సరోగసీ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటూ మార్చి 14వ తేదీన కేంద్రం తీసుకువచ్చిన సవరణలతో కూడిన సరోగసీ క్రమబద్ధీకరణ చట్టం తీసుకువచ్చింది. సంబంధిత నిబంధనలను మార్చింది. దీనిని సవాలు చేస్తూ కెనడాకు చెందిన దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఉత్పత్తి సంబంధిత ఔట్‌సోర్సింగ్ విధానాలను సరైన రీతిలో మల్చడం జరిగింది. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దీనిని చేపట్టినందున , ఇందులో తాము జోక్యం చేసుకునేది లేదని, అందుకు అవకాశం లేదని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News