అధికారులను ప్రశ్నించిన సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనా మా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగా న్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమం త్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించా రు. నళినికి ఉద్యోగం చే యాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సిఎస్, డిజిపిలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సిఎం అధికారులకు సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్ష సమావేశాన్ని సిఎం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకుండాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని ఆయన ప్రశ్నించారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.