మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పా ర్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కెసిఆర్‌ను అక్కడి నేరుగా బంరాజాహిల్స్, నందినగర్‌లోని తన సొంతింటికి తీసుకువెళ్లారు. సొంతింటికి చేరుకున్న కెసిఆర్‌కు సాంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి, హారతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. అనంతరం కెసిఆర్ తన ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కెసిఆర్ పేరు పేరు నా ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చి న అభిమానులకు అభివాదం చేశారు.
ఈ నెల 7వ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన నివాసంలో బాత్‌రూంలో జారిపడటంతో కెసిఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. దీంతో సోమాజిగూడలోని యశోద ఆ స్పత్రి వైద్యులు ఆయనకు గత శుక్రవారం రా త్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు.అనంత రం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందు తూ కోలుకుంటున్న మాజీ సిఎం కెసిఆర్‌ను ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎంఎల్‌ఎలు, పలువురు రాజకీయ, సినీ ప్ర ముఖు లు పరామర్శించారు. బిఆర్‌ఎస్ పా ర్టీ శ్రేణు లు, అభిమానులు యశోద ఆసుపత్రి కి భారీ గా తరలివస్తుండటంతో తనను పరామర్శించేందుకు ఎవరూ యశోద ఆసుపత్రికి రావద్దు అని, త్వరలోనే కోలుకుని తానే త్వరలో మీ ముందుకు వస్తాను అని పార్టీ శ్రేణులు, అభిమానులకు మాజీ సిఎం కెసిఆర్ వీడియో సం దేశం విడుదల చేసిన విషయం తెలిసిందే.