- Advertisement -
హైదరాబాద్: నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రతిపక్ష నాయకుడుగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శనివారం చర్చ ప్రారంభించారు. నిన్న(శుక్రవారం) ఉభయసభలను ఉద్దే శించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈరోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
- Advertisement -