హైదరాబాద్: ఓటమి తర్వాతనైనా బిఆర్ఎస్ లో మార్పు వస్తుందని ఆశించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నా.. ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారని ఆరోపించారు. మా పార్టీ.. మాఇష్టం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువకాలం చెల్లదని సూచించారు.
ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టాక ప్రజలు భారీగా తరలివస్తున్నారు. గతంలో ప్రగతిభవన్ లోకి హోంమంత్రికి కూడా ప్రవేశం ఉండలేదు… హోంమంత్రిని ఒక హోంగార్డు అడ్డుకుని వెనక్కి పంపించారని పేర్కొన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న సైతం ప్రగతిభవన్ ముందు గంటల కొద్దీ నిలబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు సిఎంను కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం ఉండేదికాదు. ఈనాడు సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కల్వొచ్చని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం సభలో నిరసన తెలిపినందుకు ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్నే రద్దుచేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Live || First Session of Third Telangana Legislative Assembly Day – 04
https://t.co/zYg5Dta44W— Telangana Congress (@INCTelangana) December 16, 2023