Monday, December 23, 2024

సభా మర్యాదల రక్షణకే సస్పెన్షన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొందరు సభ్యుల సస్పెన్షన్లు , ఇప్పటి లోక్‌సభ భద్రతా వైఫల్యాల ఘటనకు ఎటువంటి సంబంధం లేదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. శనివారం ఆయన పార్లమెంట్‌లో ఈ నెల 13వ తేదీన జరిగిన ఘటనల గురించి వివరిస్తూ లేఖలు పంపించారు. కొందరు సభ్యులు భద్రతా వైఫల్యాలకు , సభ్యులు కొందరి సస్పెన్షన్‌కు సంబంధం ఉందని చిత్రీకరించడం బాదాకరం అని ఈ లేఖల్లో ఆయన తెలిపారు. సభా గౌరవ మర్యాదల సంప్రదాయ పరిరక్షణ కోణంలోనే సభ్యులను సస్పెండ్ చేసినట్లు, భద్రతా వైఫల్యాలను ప్రస్తావించినందుకే వీరిని సభ నుంచి బయటకు పంపించారనే వాదన తెరపైకి రావడం దురదృష్టకరం అన్నారు. తాము ఏ విషయంలో అయినా నియమ నిబంధనలను పాటిస్తామన్నారు. గురువారం 14 మంది ఎంపీలను సభ నుంచి బహిష్కరించారు. వీరిలో తొమ్మండుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ చర్య వివాదాస్పదం అయింది. భద్రతా వైఫల్యాలను నిలదీసినందుకే చర్యకు దిగుతారా? అని విపక్షాలు స్పీకర్‌ను నిలదీశాయి. ఈ క్రమంలో స్పీకర్ ఇప్పుడు స్పందించారు.

కొత్త పార్లమెంట్ ప్రారంభం నుంచి కూడా అంతా కలిసి సభా మర్యాదలను నిలెట్టాలని నిర్ణయించుకున్నామని, సభలోపలికి ప్లకార్డులు తీసుకురావద్దని, గందరగోళానికి దిగరాదని అనుకున్నామని, దీనిని అంతా పాటించాల్సిందే అని స్పీకర్ తమ లేఖలో తెలిపారు. సభలో సభ్యుల అనుచిత ప్రవర్తనను దేశ ప్రజలు అంగీకరించరు. తరచూ సభా ఆటంకాలు, తరువాతి వాయిదాలు అనారోగ్యకరం అవుతాయని పేర్కొన్నారు. తాను ఇప్పుడు సంబంధిత సభ్యులపై తగు విధంగా చర్యలు తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని , ఇది చేయాల్సి వచ్చిందని, దీనికి వేరే విషయాలకు సంబంధం లేదన్నారు. డిసెంబర్ 13 తేదీ ఘటన తరువాత వెంటనే తాము సంబంధిత అధికార యంత్రాంగంతో చర్చించినట్లు, ఉన్నతాధికార దర్యాప్తు కమిటీ ఘటనపై ఆరా తీస్తోందని, త్వరలో నివేదిక ఇస్తుందని కూడా ఎంపిలకు తెలిపారు. ఇక ముందు పార్లమెంట్‌లో ఇటీవలి తరహా ఘటనలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని , దీనిని గుర్తించాల్సి ఉందని లేఖలలో స్పీకర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News